కలర్స్ పాపకి బీటౌన్లో అవమానం!
on Jul 8, 2015
.jpg)
ముద్దుముద్దు మాటలతో కవ్వించే దొంతరపన్ను సుందరి స్వాతి తెగ బాధపడిపోతోందట. ఏమైందమ్మా అంటే పెద్ద అవమానం జరిగింది...మళ్లీ మళ్లీ అడిగి బాధ పెట్టొద్దు అని ఫీలైపోతోందట. బుల్లితెరపై మాటలతో గారడి చేసి వెండితెరపైకి వచ్చేసింది స్వాతి. ఆరంభంలో తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో తమిళ, మలయాళీ చిత్రాల్లో బిజీగా ఉండేది. స్వామిరారా తర్వాత టాలీవుడ్ లో బాగానే నెట్టుకొస్తోంది.
లేటెస్ట్ గా త్రిపుర అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో రానుంది. అయితే తెలుగు, తమిళంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని హిందీలోనూ తీస్తే బావుంటుందని దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చిందట కలర్స్ పాప. ఇదేదో బాగుందనుకుని వెంటనే బాలీవుడ్ లోని నిర్మాతలను కలిసి తమ ప్రాజెక్టు గురించి చెప్పారట. వాళ్లు కాదనలేదు కానీ....అక్కడ హిట్టైతే ఇక్కడి సంగతి చూద్దాంలే అన్నారట.
పోనీలే అనుకునే లోగా ఇంకో ట్విస్ట్ ఇచ్చారట. ఒకవేళ హిందీలో త్రిపుర రీమేక్ చేస్తే స్వాతి అవసరం లేదని వేరే హీరోయిన్ ని తీసుకుంటామన్నారట. దీంతో అవాక్కవడం అమ్మడి వంతైంది. సలహా ఇచ్చి మరీ దెబ్బతిన్నానే అని ఫీలైపోతోందట. మొత్తానికి బీటౌన్ వెళ్లాలన్న అమ్మడి కల నెరవేరేట్టు లేదు. అయ్యో స్వాతి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



