ఆ హీరోయిన్ని చంపిందేవరు..?
on Feb 8, 2017
బెంగాలీ చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న వర్థమాన నటి అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. బితాస్తా సాహా అనే సినీ, టీవీ నటి దక్షిణ కోల్‌కతాలోని కాస్బా ప్రాంతంలో నివాసం ఉంటోంది. బితాస్తా తల్లి గత రెండు రోజులుగా ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడిన ఆమె నిన్న సాయంత్రం బితాస్తా ఫ్లాట్‌కు వచ్చి ఆరా తీయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
లోపలి నుంచి గడియ పెట్టుకున్నట్లు ఉండటంతో, ఒకటి రెండు సార్లు తలుపులు బాదింది అయినా స్పందన లేకపోవడంతో, చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె శరీరం కుళ్లిపోయిన స్థితిలో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. బాడీపై పలు చోట్ల గాయాలతో పాటు చేతులపైనా తీవ్ర గాయాలున్నాయి. పైకి ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికి, అత్యాచారం, హత్య జరిగి ఉండవచ్చంటున్నారు. అయితే ఫేస్బుక్ పోస్టులు, సాహా నివసిస్తున్న ఫ్లాట్ గోడలపై రాతలు పరిశీలిస్తే.. ఆమె కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. పోస్ట్‌మార్టం జరిగితే కానీ అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.