టాలీవుడ్‌లో బినామీ కింగ్ ఎవరు?
on Sep 29, 2014
.png)
క్యాష్ ఒకడిది.... టైటిల్ కార్డ్ ఒకడిది అంటే ఇదే..! టాలీవుడ్ లో బినామీలు మామూలే. ఒకరి పేరు మీద మరొకరు సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు మరో భారీ బినామీ కింగ్ వచ్చాడు. కమెడియన్‌గా కోట్లు వెనకేసిన ఓ నటుడు.. ఇప్పుడు బినామీలకు డబ్బులిచ్చి సినిమాలు తీయిస్తున్నాడని టాక్. రోజుల లెక్కన పారితోషికం తీసుకొనే ఓ స్టార్ కమెడియన్ ఇప్పుడు తన డబ్బుని అప్పుగా ఇచ్చి, భారీ వడ్డీలు వసూలు చేసి బినామీ కింగ్‌గా ఎదుగుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. సినిమా ఫ్లాప్ అయినా, హిట్టయినా తనకు సంబంధం లేదట. తనకు రావాల్సిన అసలుని వడ్డీతో సహా అప్పగిస్తే చాలట. ఈ రూపంలో ఇండ్రస్ట్రీలో దాదాపు రూ.70 కోట్లు అప్పుగా ఇచ్చాడని, సదరు కమెడియన్ అప్పుగా ఇచ్చిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయని... దాంతో మనోడిది లక్కీ హ్యాండ్ అనుకొని డబ్బులు తీసుకోవడానికి జనం ముందుకొస్తున్నారని తెలిసింది. అయితే వడ్డీ విషయంలో ఇతగాడు చాలా పక్కగా ఉంటాడట. బయట ఫైనాన్సియర్ల దగ్గర తీసుకొనే వడ్డీ కంటే.. ఛార్జ్ కాస్త ఎక్కువగానే వసూలు చేస్తాడని తెలిసింది. అంతేకాదు... డబ్బులు వసూలు చేయించగల కెపాసిటీ ఈ కమెడియన్ దగ్గర కావల్సినంత ఉందట. పెద్ద పెద్ద తలకాయల అండదండతో బినామీకింగ్‌గా ఎదుగుతున్న ఆ కమెడియన్ ఎవరో మీకేమైనా క్లూ దొరికిందా..??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



