బిగ్ బాస్ హౌస్ లో గిన్నెల గొడవ
on Oct 16, 2025

'కింగ్ నాగార్జున'(Nagarjuna)హోస్ట్ గా వస్తున్న 'బిగ్ బాస్ సీజన్ 9'(Bigg Boss 9)గత సీజన్ల లాగానే బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా అలరిస్తు వస్తుంది. ఆరో వారంలోకి ప్రవేశించడంతో కొంత మంది కంటెస్ట్ లకి అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఈ మేరకు తాము అభిమానించే వాళ్ళే విన్నర్ గా నిలుస్తారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తు వస్తున్నారు. కానీ హౌస్ లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానులకి చిరాకు తెప్పిస్తున్నాయి. షో లవర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అయేషా(Ayesha),రీతు(Rithu)మధ్య గిన్నెలకి సంబంధించిన గొడవ జరిగింది. ఆ ఇద్దరు ఈ విషయంపై ప్రస్తావిస్తు 'నువ్వు గిన్నె కడగలేదంటే, నువ్వు గిన్నె కడగలేదని గొడవ పడ్డారు. చాలా పెద్ద స్థాయిలోనే గొడవ జరిగింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు షో లవర్స్ స్పందిస్తు గిన్నెల గురించి గొడవ పడటం ఏంటి! అయేషా చేసిన ఓవర్ యాక్షన్ అయితే ఎంతో వెగటు పుట్టించింది. ఆమె పెద్దగా అరుస్తుంటే బర్రె గొంతులా ఉంది. కంటెస్ట్ లందరికి బిగ్ బాస్ టాస్క్ ఇస్తే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సంఘటనే కాదు రాత్రి జరిగిన ఎపిసోడ్ లో పవన్, రీతూ, కళ్యాణ్ లని ఉద్దేశించి సాయి మాట్లాడుతు వైల్డ్ కార్డు వచ్చాక టాప్ 5 లో ఉండేందుకు ఆ ముగ్గురు తెగ ఆరాటపడుతున్నారని అనడం, అందుకు అయేషా మాట్లాడుతు వాళ్ళకి మనమే అడ్డం, పైగా ఆ ముగ్గురు తనుజాని బయటకి పంపిస్తారు. ఆ తర్వాత వాళ్లలో వాళ్లే గొడవపడతారని మాట్లాడం జరిగింది. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, దివ్వెల మాధురి(Divvela Madhuri)అయేషా లు ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా అభిమానులు, షో లవర్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



