కౌశల్‌ని టార్గెట్ చేసిన బిగ్ బాస్ హౌస్...!
on Sep 4, 2018
బిగ్ బాస్ సీజన్ 2 చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది.ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా హౌస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అమిత్, శ్యామల, దీప్తిలతో పాటు మర్డర్ టాస్క్‌లో భాగంగా.. ఈ సీజన్ మొత్తం ఎలిమినేట్‌కి గురైన కౌశల్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి అందరి టార్గెట్ ఒక్కటే అది కౌశల్ . కౌశల్ ని ఇంటి నుండి ఎలాగైనా బయటకి పంపాలని ఇంటి సభ్యులు కౌశల్‌ని నామినేషన్స్ కి పంపిన ప్రతిసారి కూడా కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో రెట్టింపు ఉత్సహంతో కౌశల్ సేవ్ అవుతూ వస్తున్నాడు . అలాగే కౌశల్ తో ఇంటి సభ్యుల ప్రవర్తన కూడా మొదటి నుంచి అంతంత మాత్రంగానే వుంటుంది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో శ్యామల, దీప్తి నల్లమోతు,గీతా మాధురి ఒక టీమ్‌గా వున్నారు. సామ్రాట్,తనీష్ మరో టీమ్‌గా వున్నారు.రోల్ రైడా, అమిత్ మరో టీమ్‌గా గేమ్స్ అడుతున్నారు. కౌశల్‌కి మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో సపోర్ట్ ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకంటే కౌశల్‌కి సపోర్ట్‌గా వుండే ఒకే ఒక వ్యక్తి నూతన నాయుడు కూడా పోయిన వారం ఎలిమినేట్ కావడంతో కౌశల్ విజయం కోసం ఒంటరి పోరు చేస్తున్నాడు. ఈ పోరాటంటో చివరికి గ్రూప్స్‌గా అడుతున్న వారు గెలుస్తారా... సోలోగా అడుతున్న కౌశల్ గెలుస్తారా చూడాలి మరి.