హరితేజ, అర్చనల కొంప ముంచింది అదే!
on Sep 25, 2017

‘బిగ్ బాస్’లో చివరి వరకూ మిగిలిన లేడీ కంటెస్టంట్స్... అర్చన, హరితేజా. నిజానికి వీరిద్దరూ గట్టిపోటీనే ఇచ్చారు. అసలు హరితేజా విన్నర్ అవుతుందని చాలామంది భావించారు కూడా. తన జోరు, హుషారూ, ఆసువుగా కవిత్వాలు అల్లేయడం... బుర్రకథలు చెప్పడం.. డాన్సులు ఇరగదీసేయడం... ఇవన్నీ జనాన్ని పిచ్చ ఎంటర్టైన్ చేశాయ్. అలాగే అర్చన... తను హరితేజ అంత యాక్టీవ్ గా ఉండకపోయినా... అర్చన యాటిడ్యూడ్ ని అందరూ ఎంజాయ్ చేశారు. ఊరకే అలగడం... ఊరకే భయపడటం... ఒక్కొక్కప్పుడు అమాయకంగా కనిపించడం.. ఒక్కొక్కప్పుడు కన్నింగ్ లా అనిపించడం... ఒక్కోసారి ‘కావాలని చేస్తుందా?’ అనే అనుమానం జనాలకు కలిగేట్టు మసలడం... ఒక్కోసారి ‘అయ్యోపాపం..’ అని జనాలకు జాలి కలిగించే సందర్భాలు ఆ అమ్మాయ్ పట్ల ఎదురవ్వడం.. ఇవన్నీ అర్చనపై జనాల్లో ఇంట్రస్ట్ పెంచాయ్. అయితే... ఇక్కడ యాక్టీవ్ నెస్ ఎక్కువైనా డేంజరే. యాటిడ్యూడ్ ఎక్కువైనా డేంజరే. హౌజ్ లో ‘నువ్వు నువ్వులా ఉండాలి’. ఏదో చేయాలని ప్రయత్నాలు చేయకూడదు. హరితేజా, అర్చనల కొంప ముంచింది అదే. ఏది ఏమైనా... ‘బిగ్ బాస్’ ఫస్ట్ సేషన్ లో వీరిద్దరు పంచిన అనుభూతుల్ని నిజంగా మరిచిపోలేం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



