వాళ్ళు చేసిన తప్పుకి నన్ను ఇబ్బంది పెట్టకండి.. మంగ్లీ బర్త్ డే పార్టీపై దివి రియాక్షన్!
on Jun 11, 2025
ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో జరిగిన బర్త్ డే పార్టీలో పోలీసులు దాడులు నిర్వహించి.. గంజాయితో పాటు విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
మంగ్లీ బర్త్ డే పార్టీలో సినీ పరిశ్రమకు చెందినవారు పలువురు పాల్గొన్నారు. అందులో బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య పేరు ప్రముఖంగా వినిపించింది. న్యూస్ లో ఆమె ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఘటనపై దివి వైద్య స్పందించింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్ళడం సహజమని.. అంతమాత్రాన అక్కడేదో మిస్టేక్ జరిగితే, దానికి తన పేరు ఆపాదించడం కరెక్ట్ కాదని దివి వైద్య ఆవేదన వ్యక్తం చేసింది. "నేను ఏదైనా మిస్టేక్ చేస్తే.. నా ఫొటో ఉపయోగించండి. కానీ, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, నా ఫొటో ఉపయోగించకండి. దీని వల్ల నా కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుంది. నా ఫ్రెండ్ బర్త్ డే అని నేను వెళ్ళాను. అక్కడేదో జరిగితే.. దానికి నాది బాధ్యత కాదు కదా. నా సంబంధం విషయంలో నా ఫొటోలు ఉపయోగించి, నన్ను ఇబ్బంది పెట్టకండి." అంటూ దివి వైద్య చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
