తెలుగు సినిమా షూటింగ్ లు బంద్.. అసలు కారణాలు ఇవే!
on Jul 30, 2025

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో షాక్ తగలబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. అసలే ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి బాలేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో కొన్ని సినిమాలకు తప్ప.. మెజారిటీ సినిమాలకు థియేటర్లలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో సినీ కార్మికులు సమ్మె సైరెన్ మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంగళవారం నాటు ఫిల్మ్ ఛాంబర్ లో వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ - తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30తో ముగిసింది. కానీ, నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన చర్చల్లో ఫెడరేషన్ ప్రతినిధులతో 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పారు. అయితే దీనికి ఫెడరేషన్ అంగీకరించలేదు. ఇది తమకు సమ్మతం కాదని, తమకు అనుకూలంగా పెంచిన వారికే ఆగస్టు 1 నుంచి షూటింగ్ కి హాజరవుతామని ఫెడరేషన్ చెప్పింది.
గురువారం ఉదయం 11:30 కి కార్మిక భవన్ లో కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో కూడా సమస్య కొలిక్కి రాకపోతే.. ఆగస్టు 1 నుంచి సమ్మెకు దిగటానికి కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. అదే జరిగితే నిర్మాతలకు భారీ షాక్ తప్పదు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించి, షూటింగ్ చివరిదశలో ఉన్న పలు సినిమాలు వాయిదా పడే ప్రమాదముంది. మరి నిర్మాతలు.. కార్మిక సంఘాలతో చర్చించి, ఈ సమస్యను పరిష్కరించుకుంటారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



