షాక్ ల మీద షాక్ లు.. ఓజీ షోలు క్యాన్సిల్!
on Sep 23, 2025

నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకి బిగ్ షాక్ తగిలింది. కెనడాలోని మేజర్ చైన్స్ లో ఒకటైన యార్క్ సినిమాస్.. ఓజీ చిత్రాన్ని ప్రదర్శించబోమని ప్రకటించింది. అంతేకాదు, నార్త్ అమెరికాలో ఓజీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది. (They Call Him OG)
"ఓజీ చిత్రానికి సంబంధించిన అన్ని షోలను క్యాన్సిల్ చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కల్చరల్, పొలిటికల్ వర్గాలకు సంబంధముంది. దీని వల్ల ప్రేక్షకుల భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులు, ఉద్యోగుల భద్రత మా ప్రథమ కర్తవ్యం. అందుకే ఓజీ సినిమాని ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నాం. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న ప్రేక్షకులకు పూర్తి రీఫండ్ ఇవ్వబడుతుంది.
నార్త్ అమెరికా ఓజీ డిస్ట్రిబ్యూటర్ తరఫు వ్యక్తులు కొందరు.. గతంలో టికెట్ సేల్స్ సంఖ్యను ఎక్కువ చేసి చూపించమని రిక్వెస్ట్ చేశారు. భవిష్యత్ లో విడుదలయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచేందుకు వారు ఇలా చేస్తున్నారు. నార్త్ అమెరికాలోని సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై పూర్తి ఆధిపత్యం కోసం ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా, వీరు దక్షిణాసియా సమాజాల్లో సామాజిక స్థితి మరియు రాజకీయ అనుబంధాల ఆధారంగా విభజన సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు మేము పూర్తి వ్యతిరేకం." అంటూ యార్క్ సినిమాస్ సంచలన ప్రెస్ నోట్ విడుదల చేసింది.
యార్క్ సినిమాస్ చేసిన ఈ ఆరోపణలపై ప్రత్యంగిరా సినిమాస్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



