‘ఈగ’ను దాటేసిన మగాడు
on Sep 15, 2015
.jpg)
నాని, లావణ్య త్రిపాఠీల ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. మీడియం బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బడా సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్‌లో అయితే మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం హేమాహేమీలైన ట్రేడ్ విశ్లేషకుల్ని కూడా నివ్వెరపరుస్తోంది. నాని-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఈగ’ యుఎస్ కలెక్షన్ లను ‘భలే భలే మగాడివోయ్ దాటేసింది. ఈగ 1.08 డాలర్లు వసూళ్ళు చేయగా.. ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ 1.234 మిలియన్ డాలర్ లతో ముందుకు కొనసాగుతోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే టాప్-10లోకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ట్రేడ్ వర్గాల టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



