రాధే శ్యామ్... ప్రభాకరన్ బీట్ బాగుందోయ్!
on Oct 23, 2020

'రాధే శ్యామ్' సినిమాకి సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ పేరు ప్రకటించినప్పుడు కొంతమంది నుండి కామెంట్లు వినిపించాయి. ఎందుకంటే... తెలుగులో అతడు చేసింది ఒక్క సినిమాయే. పైగా, అది కూడా ప్లాప్. అదీ విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'. అయితే... ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ ద్వారా తానేంటో జస్టిన్ ప్రభాకరన్ నిరూపించుకున్నాడు.
రోమియో-జూలియట్... సలీం-అనార్కలి... దేవదాసు-పార్వతి... చరిత్రలో నిలిచిపోయిన, ఎప్పటికీ చరిత్ర గుర్తుపెట్టుకునే గొప్ప ప్రేమికులు. 'రాధా శ్యామ్' కూడా అటువంటి గొప్ప ప్రేమికుల కథే అన్నట్టు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ప్రభాస్-పూజా హెగ్డే జోడీ బాగుంది. దర్శకుడు రాధాకృష్ణకుమార్ టేకింగ్ కూడా బాగుంది. వీటన్నిటితో పాటు, ఇంకాస్త చెప్పాలంటే వీటన్నిటికంటే కొంచెం ఎక్కువే నేపథ్య సంగీతం ప్రేక్షకులని ఆకట్టుకుంది.
"కృష్ణ కృష్ణ మదమోహన
చిత్రచోర రాధా జీవన
మేఘశ్యామ మధుసూదన
రాధే శ్యామ యెదు నందన"
అంటూ సాగిన నేపథ్య గీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రభాకరన్ బీట్ బాగుందని శ్రోతలు అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



