బతుకమ్మ షార్ట్ ఫిలిం పోటీలు.. విజేతలకి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా
on Sep 17, 2025

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలతో పాటు, ప్రజల జీవన విధానంతో ముడిపడిన పండుగ 'బతుకమ్మ'(Bathukamma).తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో మహిళలు పలు రకాల పూలతో 'బతుకమ్మ'ని ఎంతో భక్తి శ్రద్దలతో అందంగా పేర్చుకుని పూజిస్తారు. ఈ సంవత్సరానికి సంబంధించి 'సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు 'బతుకమ్మ' వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 'తెలంగాణ ప్రభుత్వం'(Telangana Government)తెలుగు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ 'దిల్ రాజు'(Dil Raju)తో కలిసి కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఉన్న యువ కళాకారులకి పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్(Short Films)పాటల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు.ఈ పోటీలకు సంబంధించిన అర్హతలు :
1.ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరు 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.
2. వీడియో 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
3. షార్ట్ ఫిల్మ్స్, వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4.మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
5.బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి
పోటీల్లో ఎంపికైన విజేతలకు
ప్రథమ బహుమతి :.3 లక్షల రూపాయలు
ద్వితీయ బహుమతి: .2 లక్షలు
తృతీయ బహుమతి: 1 లక్ష
కన్సోలేషన్ బహుమతి : 20 వేలు చొప్పున అయిదుగురికి ఇవ్వడంతో పాటు విజేతలందరికీ ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేస్తారు.
నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తుంది.
ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com కి గాని లేదా 8125834009 అనే వాట్సాప్ నెంబర్ కి పంపాలి. తుది గడువు సెప్టెంబరు 30, 2025గా నిర్ణయించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



