'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్.. బండ్ల వర్సెస్ త్రివిక్రమ్.. ఎవరిది పైచేయి?
on Jul 25, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎందరో అభిమానులున్నా వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి ప్రత్యేక స్థానముంటుంది. సినిమా వేడుకల్లో పవన్ ని మాటలతో ఆకాశానికెత్తే బండ్ల స్పీచ్ లకి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అందుకే పవన్ ప్రతి సినిమా వేడుకకి బండ్ల రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అయితే పవన్ గత చిత్రం 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి బండ్ల మిస్ అయ్యాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ తనని రానివ్వకుండా చేస్తున్నాడని బండ్ల వాయిస్ తో ఉన్న ఆడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. దీంతో పవన్ తాజా చిత్రం 'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్ కి బండ్ల రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే 'భీమ్లా నాయక్'కి ఎలాగైతే త్రివిక్రమ్ రచయితగా పనిచేశారో అలాగే 'బ్రో'కి కూడా రచయితగా పనిచేశారు. దీంతో త్రివిక్రమ్, బండ్ల ఒకే వేదికపై కనిపించరని భావించారంతా. కానీ ఊహించని విధంగా బండ్ల 'బ్రో' వేడుకకి వస్తున్నట్లు తెలుస్తోంది.
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు(జూలై 25) సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి బండ్ల కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం. బండ్ల వస్తే తన స్పీచ్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపడం గ్యారెంటీ. అదే సమయంలో త్రివిక్రమ్ స్పీచ్ లకి ఎందరో అభిమానులుంటారు. సినిమాల్లో ఆయన మాటలకే కాదు, స్టేజి పైన ఆయన స్పీచ్ లకి కూడా ఎంతో క్రేజ్ ఉంది. అంటే ఒకేరోజు ఒకే వేదికపై అటు బండ్ల, ఇటు త్రివిక్రమ్ స్పీచ్ లు చూడబోతున్నాం. మరి వీటిలో ఎవరి స్పీచ్ హైలైట్ అవుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



