లయన్‌ని అమ్మేశారు
on Mar 10, 2015

శాటిలైట్ మార్కెట్ ఈ రోజుల్లో సినిమా వ్యాపారంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఓ సినిమా విడుదలకు ముందే శాటిలైట్ హక్కుల్ని అమ్ముకోవడ నిర్మాతకు అత్యవసరం. చిన్న సినిమా వైపు నిర్మాతలు కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే స్టార్ హీరోల సినిమాలు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా లయన్ శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. రూ.6.25 కోట్లతో లయన్ హక్కుల్ని జెమిని సొంతం చేసుకొంది. లెజెండ్‌తో పోలిస్తే.. లయన్ తక్కువ రేటుకే దక్కించుకొంది జెమిని. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే జంటగా నటించిన ఈ చిత్రానికి సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 28న లయన్ పాటల్ని విడుదల చేస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



