"శ్రీమన్నారాయణ" గా బాలయ్య
on Feb 12, 2012
"శ్రీమన్నారాయణ" గా బాలయ్య నటించనున్నారు. "శ్రీమన్నారాయణ" అంటే ఇదేదో పౌరాణిక చిత్రం అనుకుంటారేమో...కాదండీ బాబూ...ఇది ఫక్తి సోషల్ మూవీ. యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, గతంలో "మిరపకాయ్" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రమేష్ పుప్పాల ప్రస్తుతం యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా, రవి చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి "శ్రీమన్నారాయణ" అన్న పేరు నిర్ణయించారని సమాచారం.
ఈ "శ్రీమన్నారాయణ" చిత్రానికి బాలయ్య హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ "సింహా" చిత్రానికి అద్భుతమైన సంగీతాన్నందిన చక్రి సంగీతాన్నందిస్తున్నారు. ఈ "శ్రీమన్నారాయణ" ఇటీవల అన్నపూర్ణ స్టుడియోలో మిట్టమధ్యాహ్నం ప్రారంభమైన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



