స్టార్ హీరోలపైనే అనిల్ ఫోకస్
on Apr 21, 2021
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన `పటాస్` (2015)తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ ఎటెంప్ట్ లోనే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ నెక్స్ట్ సాయిధరమ్ తేజ్ తో `సుప్రీమ్` (2016) చేశాడు. అది కూడా హిట్ బాట పట్టింది. అలా.. తొలి రెండు ప్రయత్నాలను మీడియం రేంజ్ హీరోలతోనే చేశాడు అనిల్.
ఆ తరువాత మాత్రం అనిల్ శైలి మారింది. స్టార్ హీరోలవైపే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. అనిల్ హ్యాట్రిక్ ఫిల్మ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా `రాజా ది గ్రేట్` (2017) పేరుతో తెరకెక్కితే.. ఆపై నాలుగో సినిమా విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో `ఎఫ్ 2` (2019) టైటిల్ తో రూపొందింది. అనంతరం ఐదో సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో `సరిలేరు నీకెవ్వరు` (2020)గా తీర్చిదిద్దాడు.
కట్ చేస్తే.. ఇప్పుడు వెంకీతోనే `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` చేస్తున్న అనిల్.. ఆ నెక్స్ట్ వెంచర్ ని నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద.. అనిల్ దృష్టంతా స్టార్ హీరోలవైపే ఉందనే చెప్పాలి. మరి.. భవిష్యత్ లోనూ ఇదే పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.