ఇరాక్ దేశపు పేపర్ లో బాలకృష్ణ గురించి ఆర్టికల్..మరి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు
on Apr 14, 2025

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' (Balakrishna) ఈ సంక్రాంతికి 'డాకుమహారాజ్'(Daaku Maharaaj)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీలో, రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో బాలయ్య ప్రదర్శించిన నటనకి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక రకంగా బాలయ్య మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపించాడు. 130 కోట్ల రూపాయలకి పైగా వసూళ్ళని కూడా రాబట్టిన డాకు మహారాజ్, సిల్వర్ స్క్రీన్ వద్ద బాలయ్యకి ఉన్న స్టామినాని మరోమారు చాటి చెప్పింది.
రీసెంట్ గా 'డాకు మహారాజ్' ఒక అరుదైన ఘనతని అందుకుంది. 'ఇరాక్'(Iraq) దేశంలోని ప్రముఖ న్యూస్ పేపర్ 'డాకు మహారాజ్ గురించి ప్రస్తావిస్తు హీరో క్యారక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దారు. అద్భుతమైన సాంకేతికతని ఉపయోగించడంతో పాటు, యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయనంటు ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. అందులో కథతో పాటు కలెక్షన్స్ వివరాలని కూడా అందులో ప్రస్తావించారు. దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఒక తెలుగు సినిమా గురించి ఇరాక్ దేశానికి చెందిన పేపర్ లో రావడం చాలా గొప్ప విషయమని, ఇది మా బాలయ్య కి మాత్రమే సాధ్యమంటు సోషల్ మీడియా వేదికగా ఆర్టికల్ ని షేర్ చేస్తున్నారు.
డాకు మహారాజ్ కి బాబీ దర్శకత్వం వహించగా బాలకృష్ణ కి జతగా ప్రగ్య జైస్వాల్(Pragya Jaiswal) చెయ్యగా, శ్రద్ధ శ్రీనాధ్(Shraddha Srinath), బాబీడియోల్, ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ (NagaVamsi) భారీ వ్యయంతో నిర్మించగా థమన్(Thaman) సంగీతాన్ని అందించాడు. ఓటిటి వేదికగా కూడా పలు రికార్డులని నమోదు చేసిన డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



