బాలయ్యతో కాజల్ రొమాన్స్!!
on May 13, 2019

`ఎన్టీఆర్` బయోపిక్ ఇచ్చిన రిజల్ట్ తో షాక్ తిన్న బాలయ్య తన తదుపరి సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. వెంటనే బోయపాటితో సినిమా చేయాల్సి ఉన్నా కానీ, ఆ స్క్రిప్ట్ ఇంకా పకడ్బందీగా రెడీ చేయిస్తున్నాడు. ఈ గ్యాప్ లో కె.యస్.రవికుమార్ డైరక్షన్ లో ఒక సినిమా కమిటయ్యాడు బాలయ్య. గతంలో వీరిద్దరి కాంబినేషనల్ వచ్చిన `జై సింహా` యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మరోసారి వీరి కలయికలో ఒక పక్కా కమర్షియల్ సినిమా రాబోతుంది. దీనికి `రూలర్` అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ నెల 17న సినిమా లాంఛనంగా ప్రారంభించుకొని వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుందట. ఇక బాలయ్య సరసన కాజల్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇప్పటికే కాజల్ కి స్టోరి చెప్పడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న తొలి సినిమా ఇది. ఇక ఆసక్తికరమైన న్యూస్ ఏంటంటే... బాలయ్య ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారట. ఇందులో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ అని తెలుస్తోంది. ఇందులో లెజెండ్ తరహాలో జగపతి అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడట. చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సి.కళ్యాన్ నిర్మిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



