తానాకి అతిథిగా నందమూరి బాలకృష్ణ
on May 3, 2011
తానాకి అతిథిగా నందమూరి బాలకృష్ణ వెళ్ళనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అమెరికాలోని ప్రవాసాంధ్రులంతా కలసి ఏర్పాటుచేసుకున్న సంస్థ "తానా". తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని అర్థం. తానా సంస్థ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహాసభలను జరుపుకుంటుంది. ఆ మహాసభలకు ప్రతిసారీ మన తెలుగు వారిలో ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటుంది.
.jpg)
అలా ఈసారి మన ప్రముఖ తెలుగు హీరో నందమూరి నటసింహం, యువరత్న నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా తానాకు ఆహ్వానించింది. అందుకు నందమూరి బాలకృష్ణ కూడా తన అంగీకారాన్నితానా వారికి తెలియజేశారు. ఈసారి తానా మహాసభలు అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో , జూలై నెలలో జరుగనున్నాయి. ఈసారి తానా మహాసభలకు నందమూరిబాలకృష్ణతో పాటు 2010 ఇండియన్ ఐడిల్ విన్నర్ శ్రీరామచంద్రను కూడా ఆహ్వానించారు. అక్కడ శ్రీ రామచంద్ర తన పాటలతో వారిని అలరించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



