ఏం షాకిచ్చావ్ బాలయ్యా..?!
on Aug 15, 2015
.jpg)
బాలయ్య... బాలయ్య... బాలయ్య.. అభిమానుల గుండెల్లో నిత్యం మర్మోగే మంత్రమిది. బాలయ్యని తెరపై చూసుకొంటే చాలు.. కోటి దీపాలు వెలిగినట్టుంటాయ్ వాళ్లకి. అలాంటి నందమూరి ఫ్యాన్స్‌కి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. నందమూరి బాలకృష్ణ త్వరలోనే సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నారు. 100వ సినిమానే బాలయ్య ఆఖరి సినిమా. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ అధికారికంగానూ ప్రకటించారు.
వందో సినిమా తరవాత తాను పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెడతానని చెబుతున్నారు బాలకృష్ణ. అంటే సినిమాలకు దూరమైనట్టే కదా..?! డిక్టేటర్ బాలయ్య 99వ సినిమా. ఆ తరవాత బోయపాటి శ్రీనుతో సెంచరీ సినిమా పూర్తి చేస్తారు. 2016 నాటికి బాలయ్య వందో సినిమా పూర్తవుతుంది. ఆ తరవాత పూర్తిగా ఆయన పాలిటిక్స్ లోనే ఉండిపోనున్నారు. అందుకే వీలైనంత త్వరగా తన నటవారసుడు మోక్షజ్ఞని వెండి తెరపై చూసుకోవాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం కూడా రంగం సిద్ధమవుతోంది.
మోక్షజ్ఞకు సరిపడా కథ సిద్ధమవుతోందని టాక్. త్వరలోనే బాలయ్యకు `మంత్రి` పదవి దక్కబోతోందన్న ప్రచారం కూడా మరోవైపు ఉదృతంగా నడుస్తోంది. మంత్రిగా పదవీ స్వీకారం చేశాక కూడా సినిమాలు, షూటింగులూ అంటూ ఆలోచిస్తే కుదరదు. అందుకే బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకొన్నారని చెప్పుకొంటున్నారు. బాలకృష్ణ సినిమాలకు దూరమవ్వాలనే నిర్ణయం తీసుకోవడం అభిమానులకు నిజంగా షాకింగ్ న్యూసే. కానీ.. రాజకీయాలతో ప్రత్యక్షంగా ప్రజలకు టచ్‌లో ఉంటారు కాబట్టి... కొంతలో కొంత సర్దుకపోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



