బాలయ్య, పవన్ మధ్య బాక్సాఫీస్ వార్.. ఏ సినిమాలో తెలుసా..?
on Sep 7, 2025

సెప్టెంబర్ 25న 'అఖండ-2'తో బాలకృష్ణ, 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర తలపడాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా 'అఖండ-2' వాయిదా పడింది. దీంతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఫైట్ మిస్ అయింది. అయితే, సెప్టెంబర్ కి మిస్ అయిన వీరి పోరు.. డిసెంబర్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. (Balakrishna vs Pawan Kalyan)
'అఖండ-2'ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే టైంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ సినిమా ఏదో కాదు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీని.. డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'అఖండ-2'పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మరోవైపు 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగితే.. పోరు ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో డౌట్ లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



