బాలయ్య బాబు `లాయర్ సాబ్`
on Aug 6, 2019
నందమూరి బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం `పింక్` తెలుగు లో రీమేక్ కాబోతున్నట్టు ఇటీవల న్యూస్ వస్తోన్న సంగతి తెలిసిందే. కోర్ట్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రానికి `లాయర్ సాబ్` టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచో బాలయ్య తో దిల్ రాజు సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తో దిల్ రాజు కోరిక తీరబోతుంది. దిల్ రాజు తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ కూడా ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తారట. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా రీమేక్ చేసారు. ఈ నెల 8న భారీగా అక్కడ రిలీజ్ కానుంది. ఇక బాలయ్య ప్రెసెంట్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత లాయర్ సాబ్ సప్రారంభిస్తారట. త్వరలో దీని పై అధికారికంగా న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.