థమన్ కి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన బాలయ్య..!
on Feb 15, 2025

నటసింహం నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు థమన్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న వరుస సినిమాలకు థమన్ సంగీతం అందిస్తూ.. ఆయన సాధిస్తున్న ఘన విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలయ్య సినిమా అంటే థమన్ మరింత అద్భుతంగా సంగీత అందిస్తాడేమో పేరు పడిపోయింది. అందుకే నందమూరి అభిమానులు సైతం నందమూరి థమన్, NBK థమన్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. బాలకృష్ణ కూడా థమన్ అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా థమన్ కి ఒక ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు బాలయ్య. "థమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చాను. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను." అని ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలకృష్ణ నటించిన గత నాలుగు చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' కి థమనే సంగీతం అందించాడు. ఈ నాలుగు సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'అఖండ-2' కి సైతం థమనే సంగీతం అందిస్తుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



