భారతరత్న ఖచ్చితంగా వస్తుంది!
on Feb 3, 2025

ఇటీవల నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన బాలకృష్ణ.. తనకు పద్మభూషణ్ రావడం కంటే, తన తండ్రి ఎన్టీఆర్ కి భారతరత్న రావడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. (Nandamuri Balakrishna)
తాజాగా హిందూపురం వెళ్లిన బాలకృష్ణ, అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలనేది మా అందరి కోరిక అని, ఖచ్చితంగా వస్తుందని అన్నారు. అలాగే, పద్మభూషణ్ రావడం తనలో ఇంకా కసి పెంచిందని చెప్పారు. నాకు నేనే ఛాలెంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాను. ఇంకా ఏదో సాధించాలనే తపన, తల్లిదండ్రుల ఆశీర్వాదమే నన్ను నడిపిస్తున్నాయి అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



