బాలయ్య సెంచరీకి రాజమౌళి ఓకే!
on May 6, 2014
'
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నాడని ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. 97వ సినిమాగా విడుదలైన లెజెండ్ బాలకృష్ణ కెరీర్‌లో భారీ హిట్ అయ్యింది. అలాగే 98, 99 సినిమాల్ని కూడా త్వరగా పూర్తి చేసి 2015 చివర్లో 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చెయ్యాలని బాలయ్య చూస్తున్నాడట. అయితే ఈ సినిమాను నిర్మించే అవకాశం ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటికి దక్కినట్లు సమాచారం. దాంతో ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడానికి రాజమౌళిని ఒప్పించాడట. ప్రస్తుతం 'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా వున్న రాజమౌళి ఆ తరువాత బాలయ్యతో సినిమా చేస్తాడట. ఇప్పటికే బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గ కథను సిద్దం చేయమని తన తండ్రి విజయేంద్రప్రసాద్ ను కోరారట. ఈ కాంబినేషన్ తో బాలయ్య 100వ సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



