బేబీ డైరెక్టర్ కి భారీ గిఫ్ట్!
on Sep 30, 2023
సినిమాకి చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం ఉండదు. సినిమా కంటెంట్ బాగుంటే చాలు ఏ సినిమా అయిన ఘన విజయం సాధిస్తుందని చెప్పిన సినిమాలు ఎన్నో వచ్చాయి.అలాంటి కోవకి చెందిన ఒక సినిమా ఈ మధ్యనే వచ్చింది పైగా పెద్ద హీరోల సినిమాల మధ్య రిలీజ్ అయ్యి వర్షాలని సైతం లెక్క చెయ్యకుండా జనాన్ని థియేటర్స్ కి పరుగులు తీయించింది. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడికి ఒక భారీ గిఫ్ట్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్ అవుతుంది.
జులై నెల మధ్యలో రిలీజ్ అయిన బేబీ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య,ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రధారులుగా వచ్చిన బేబీ మూవీ 100 కోట్ల మైలురాయిని అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్ఠ్టించింది. ఆ సినిమాలో నటించిన అందరు కూడా చాలా అద్భుతంగా నటించి సినిమా ఘన విజయం లో తమ వంతు పాత్రని పోషించారు.ఇటీవలే ఓటిటి లో కూడా బేబీ రిలీజ్ అయ్యి రికార్డు వ్యూయర్స్ తో సంచలనం సృష్టించింది.
ఇంక అసలు విషయాన్ని వస్తే ఎస్.కె .ఎన్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన బేబీ చిత్రాన్ని సాయి రాజేష్ తన దర్శకత్వ ప్రతిభతో అత్యద్భుతంగా తెరకెక్కించాడు. తను కథని చెప్పిన విధానం ,నడిపించిన విధానం ,అలాగే టేకింగ్ ఒక రేంజ్ లో ఉంది సినిమా ఘన విజయానికి కూడా సాయి నే ప్రధాన కారణమయ్యాడు.ఇప్పుడు బేబీ సినిమాని ఘన విజయం సాధించేలా తీర్చిదిద్దిన సాయి రాజేష్ కి ఆ చిత్ర నిర్మాత ఒక భారీ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు .కారు అందుకున్న సాయి రాజేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నిర్మాత కి కృతజ్ఞతలు చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
