గుడ్ న్యూస్.. కట్టప్ప కోలుకున్నాడు
on Jan 11, 2022

బాహుబలి సినిమాతో కట్టప్పగా అందరికీ దగ్గరైన కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సత్యరాజ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే తాజాగా సత్యరాజ్ ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు సిబి సత్యరాజ్ శుభవార్త చెప్పారు.
తన తండ్రి సత్యరాజ్ కరోనా నుంచి కోలుకున్నారని తెలుపుతూ సిబి సత్యరాజ్ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. తన తండ్రి సత్యరాజ్ సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి చేరుకున్నారని సిబి అన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని, కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తన వర్క్ తిరిగి ప్రారంభిస్తారని తెలిపారు. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ సిబి ట్వీట్ చేశారు.
కాగా ఇటీవల సత్యరాజ్ తో పలువురు సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వారిలో మహేష్ బాబు, మీనా, త్రిష, మంచు లక్ష్మి, ఖుష్బూ, తమన్ వంటి వారు ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



