క్షమాపణలు చెప్పిన 'బాహుబలి' రైటర్
on Jul 24, 2015

సాధారణంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ కి మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది హడావిడి చేస్తుంటారు. అది కామన్ థింగ్. పాపం ఇప్పుడు ఆ చిక్కు 'బాహుబలి' సినిమాకు కూడా వచ్చింది. దర్శకమౌళి రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం పలు బాషల్లో విడుదలయి రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం తమిళ వెర్షన్ లో ఉన్న వాడిన కొన్ని పదాలు దళితులను కించపరిచేలా ఉన్నాయని వివాదం రేగింది. ఈ సినిమాలో వాడిన ‘pagadai' అనే పదం దళితులలో ఓ వర్గాన్ని కించ పరిచేలా ఉందని వెంటనే ఆ పదాన్ని తీసేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో తమిళవెర్షన్ లో డైలాగ్స్ రాసిన మదన్ కార్కే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు తెలిపాడు. తాను రాసిన పదం వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించండంటూ.. అసలు అది ఓ కమ్యూనిటికి చెందిన పదమని కూడా తెలియదని.. వెంటనే సినిమాలో నుండి ఆ పదాన్ని తీసేస్తున్నా అని చెప్పారు. పాపం ఆఖరికి 'బాహుబలి'కి కూడా సినిమాకష్టాలు తప్పలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



