మొత్తానికి ఊపిరి పీల్చుకున్న రాజమౌళి
on Apr 22, 2017

బాహుబలి 2 రిలీజ్ కి ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎందుకంటే కర్ణాటక బిజినెస్ ఇంకా అవలేదు. దానికి కారణం, కొందరు కన్నడ ఆర్గనైజషన్ వాళ్ళు సినిమా విడుదలని నిలిపివేయాలని నిరసనలు వ్యక్తం చేశారు. ఇది చిన్నగా తీసుకునే వ్యవహారం కాదు. యావత్ కన్నడిగులు, ఈ నిరసనలకు తమ మద్దతు తెలిపారు. కావేరి జలాల విషయంలో 9 సంవత్సరాల క్రితం బాహుబలిలో కట్టప్ప గా చేసిన సత్యరాజ్ చేసిన విమర్శలు కన్నడిగుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, సత్యరాజ్ క్షమాపణలు చెబితే తప్ప విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని భీష్మించి కూర్చున్నారు.
రాజమౌళి ఒక వీడియో విడుదల చేసి తన బాధని వ్యక్తం చేశారు. ఒక రోజు తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గిన సత్యరాజ్ మొత్తానికి కన్నడిగులకి క్షమాపణలు చెప్పి, బాహుబలి 2 విడుదలని ఆపొద్దని విన్నవించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, సత్యరాజ్ స్టేట్మెంట్ తో శాంతించిన కన్నడిగులు సినిమాని ఆపమని చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఇదేగనక నిజమయితే, రాజమౌళి కి పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. సినిమా తీసేప్పుడు ఎంత కష్టపడ్డాడో రిలీజ్ కి కూడా అంతే కష్టపడుతున్న రాజమౌళి ని చూస్తే డెడికేషన్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



