మెట్టు దిగిన కట్టప్ప..కర్ణాటక ప్రజలకు క్షమాపణ
on Apr 21, 2017
కట్టప్ప మెట్టు దిగాడు..కావేరి నదీ జలాల విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కర్ణాటకకు, కన్నడ ప్రజలకు తాను వ్యతిరేకం కాదని..తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరాడు. బాహుబలి కన్‌క్లూజన్‌ను అడ్డుకోవద్దని..బాహుబలి మొదటి భాగాన్ని ఆదరించినట్లే..రెండో భాగాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తన వల్ల బాహుబలి వంటి గొప్ప చిత్రానికి ఇబ్బందులు రావడం ఇష్టం లేదని, ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ చేరాల్సి ఉందని అన్నారు.
కన్నడ ప్రజలంటే తనకెంతో గౌరవమన్నారు. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ నది విషయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే ఆయన నటించిన బాహుబలిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఇరు వర్గాలు భీష్ముంచుకుని కూర్చొవడంతో కర్ణాటకలో బాహుబలి విడుదలకావడం కష్టమే అనుకున్నారు. అయితే నిన్న రాజమౌళి స్వయంగా విజ్ఞప్తి చేయడం..ఇవాళ కట్టప్ప క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతం అయినట్లేనని భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



