బాహుబలి-2లో డైలాగులు ఇవే..!
on Mar 26, 2017
.jpg)
ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాహుబలి ద కన్‌క్లూజన్ ట్రైలర్‌లో ఒకే ఒక్క డైలాగ్ చెప్పి అభిమానుల్లో అంచనాలను పెంచేశాడు రాజమౌళి. అయితే ఇంకా ఇందులో ఎలాంటి పంచ్ డైలాగ్‌లు ఉన్నాయా అని ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వెతుకుతున్నారు. బాహుబలి-2 ప్రి-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా బాహుబలి అదేనండి మన ప్రభాస్ అభిమానుల కోసం రెండు డైలాగులు చెప్పాడు. "నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా ", "వాడు తప్పు చేశాడు, వాడి తలతెగింది" అంటూ మరో డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ ఊగిపోయారు. అలాగే చాలా ఆలస్యమైంది, జాగ్రత్తగా వెళ్లండి అంటూ అభిమానులకు సూచించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



