ఎప్పటికీ నా ఫేవరేట్ కో-స్టార్ ప్రభాస్ డార్లింగే
on Mar 26, 2017
.jpg)
నేను నా కెరిర్‌లో ఎంతో మందితో పనిచేశాను కాని ఎప్పటికీ నా ఫేవరేట్ కో-స్టార్ ప్రభాసే అన్నారు భల్లాలదేవుడు రానా దగ్గుబాటి. కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే బాహుబలి కలకాలం నిలిచిపోయే చిత్రమని రెండేళ్ల కిందట తాను చెప్పిన విషయాన్ని రానా గుర్తు చేశాడు. ఐదేళ్లపాటు ఈ సినిమాకు పనిచేశానని, ఇందులో పని చేసిన ప్రతిక్షణం తనకు తీపి గుర్తేనని అన్నాడు. అలాంటిది ఇకపై మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్లలేనంటే బాధగా ఉంటుందని..వల్లి గారితో తిట్లు తినకపోతే జీవితంలో ఏదో లోటు ఉంటుందని రానా చెప్పాడు. వల్లి గారూ వారానికోసారి అయినా తిట్టండి..మీకు నేను ఛాన్సులు ఇస్తాను అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



