ఈ వారం తమిళ్‌లో విడుదలవుతున్న సినిమాలివే!
on Mar 1, 2023

ప్రతి శుక్రవారం జనాల ముందుకు వచ్చే సినిమాల మీద ఎప్పుడూ ఓ దృష్టి ఉంటూనే ఉంటుంది. ఈ సారి 3.3.2023 అని వస్తుండటంతో ఈ నెంబర్ మీద చాలా మంది ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఈ నెల 3న నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
మతపరమైన చర్చ
వాటిలో ఒక సినిమా అయోత్తి. శశికుమార్ ,ప్రీతీ అస్రానీ జంటగా నటించారు. సమాజంలో ఉన్న మతపరమైన సమస్యలను ఆధారంగా చేసుకుని ఆర్.మందిరమూర్తి ఈ సినిమాను తెరకెక్కించారు. మతపరమైన చర్చలతో సాగుతుంది అయోత్తి.
ప్రభుదేవా సైకో థ్రిల్లర్
త్రిష ఇల్లన్న నయనతార, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ వంటి సినిమాలను డైరక్ట్ చేసిన ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సినిమా బహీరా. సైకో థ్రిల్లర్ సినిమా ఇది. మై డియర్ భూతమ్ తర్వాత ప్రభుదేవా నటించిన మూవీ. ఈ సినిమాలో ప్రభుదేవా, అమైరా దస్తూర్, రమ్యా నంబీసన్, జనని అయ్యర్, సంచితా శెట్టి, గాయత్రి శంకర్, సాక్షి అగర్వాల్, సోనియా అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. గణేశన్ శేఖర్ సంగీతం అందించారు.
మిత్రన్ సినిమా!
ధనుష్ నటించిన యారడీ నీ మోహినీ, ఉత్తమ పుత్రన్, కుట్టి, తిరుచిట్రంబలం, మీండుం ఒరు కాదల్ కదై వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను తెరకెక్కించిన అరియవన్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
అందరూ కొత్తవారితో!
ఈషాన్, ప్రణాళి జంటగా నటించిన సినిమా అట్టకత్తి. దినేష్, సంచితా శెట్టి, ఆనంద్ బాబు, జగన్, నాన్ కడవుల్ రాజేంద్రన్, సారా నటించిన సినిమా పల్లు పడామ పాత్తుకో. విజయ్ వరదరాజ్ దర్శకత్వం వహించారు. బాలమురళి బాలు సంగీతం అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



