"అభినేత్రి" ఆడియో వేడుకకు అతిలోకసుందరి!
on Jul 5, 2016
తమన్నా టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం "అభినేత్రి". తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దిగ్గజాలు సాజిద్-వాజిద్ మరియు విశాల్ స్వరసారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో వేడుకను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కోన వెంకట్ తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకకు అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఆడియో వేడుకకు శ్రీదేవికి ఉన్న సంబంధం ఏమిటో తెలియదు కానీ.. శ్రీదేవి చాన్నాళ్ల తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దర్శనమీయనుంది. తమిళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకురానుంది!