ఒకేసారి... న్యూ ఇయర్ + హనీమూన్
on Nov 18, 2019

గత గురువారం నటి అర్చన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ హెల్త్‌కేర్‌లో వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రముఖ పారిశ్రామివేత్త జగదీష్‌తో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరినీ కలిపింది నటుడు శివబాలాజీ దంపతులు. అయితే... తమది ప్రేమ వివాహాం కాదనీ, అరేంజ్డ్ లవ్ అనీ అంటోంది అర్చన. జగదీష్, అర్చనను శివబాలాజీ దంపతులు కలిపిన తర్వాత ఇద్దరూ ఇంట్లో పెద్దలకు మీటింగ్ ఆరెంజ్ చేశారట. వాళ్ళ మీటింగ్ తర్వాతే తమ మధ్య ప్రేమ మొదలైందని అర్చన చెప్పుకొచ్చింది. కొత్తగా పెళ్ళైన జగదీష్, అర్చన జంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? మ్యాగ్జిమమ్ అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంకా ఫుల్ ప్లానింగ్ చేయలేదట. అమెరికాను ఒక ఆప్షన్ గా పెట్టుకున్నామన్నాడు. పెళ్ళికి ముందు పెళ్లి ప్లానింగ్ తో సరిపోయిందనీ, హనీమూన్ గురించి ఆలోచించలేదనీ... ఇప్పుడు న్యూ ఇయర్, హనీమూన్ ట్రిప్ ఒకేసారి ప్లాన్ చేస్తున్నామని జగదీష్ చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



