`అరవింద` ఆడియోకు నో చెప్పిన ఎన్టీఆర్!!
on Sep 14, 2018
ఎంతో ఇష్టపడే తండ్రి హరికృష్ణ మరణం ఎన్టీఆర్ ని తీవ్రంగా కలచివేసింది. అయినా కానీ ఎన్టీఆర్ ఆ బాధను మనసులో దాచుకుని నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని `అరవింద సమేత` షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతోంది. ఇదిలా ఉంటే అరవింద ఆడియో ఈ నెల 20న గ్రాండ్ గా జరగనుందనీ, ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం తెలుస్తున్న వార్తల ప్రకారం అరవింద ఆడియో ఫంక్షణ్ లేదట. దీనికి ఎన్టీఆర్ నో చెప్పడంతో ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలో పాటలు డైరక్ట్ గా మార్క్ ట్ లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం తమన్. పూజా హెగ్డే హీరోయిన్. జగపతి బాబు, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.