అరవింద సమేత.. డేట్ ఫిక్స్.. టీజర్ లీక్
on Aug 10, 2018

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడం, మరోవైపు ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. దానికి తగ్గట్టే సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. త్వరలో టీజర్ కూడా ప్రేక్షకులను పలకరించనుంది.. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆగస్టు 15 న టీజర్ రిలీజ్ అని అనౌన్స్ కూడా చేసింది.. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.. ఇంతలోనే బ్యాడ్ న్యూస్.. 'అరవింద సమేత' టీజర్ లీక్ అయింది.. లీక్ అయిన టీజర్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి.. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డల్ అయ్యారు.. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



