రుద్రమదేవికి మోక్ష మెప్పుడో?
on Jul 4, 2015
.jpg)
Anushka ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక మూవీ 'రుద్రమదేవి'. ఈ సినిమాను ఏ సమయంలో విడుదల చేయాలో తెలియక గుణశేఖర్ గత కొంతకాలంగా సతమతమవుతున్నారు. లేటెస్ట్ గా 'రుద్రమదేవి'ని బాహుబలి రిలీజ్ తరువాత విడుదల చేద్దామనే సన్నాహాలు గుణశేఖర్ మొదలు పెట్టినట్లు సమాచారం.
ఈ నెల 10న బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న సందర్భంలో ఆ సినిమాకి వచ్చే రెస్పాన్స్ బట్టి రుద్రమదేవిని వెంటనే రిలీజ్ చేయాలా లేక ఆగస్టు ఆఖరుకు వెళ్లాలనెది గుణశేఖర్ డిసైడ్ చేస్తాడట. కానీ ఎటు చూసిన గుణశేఖర్ రుద్రమదేవికి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆగస్ట్ లో మహేష్ శ్రీమంతుడు, రవితేజ కిక్ రిలీజ్ కి సిద్దంగా వున్నాయి.
మహేష్ శ్రీమంతుడు ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ అవుతుండగా, రవితేజ కిక్ 2 మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలే వున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు సూపర్ అంటే మాత్రం మళ్లీ మరోసారి 'రుద్రమదేవి' వాయిదాకు వెనుకాడకపోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



