అనుష్క, నయన - చిరు పక్కన ఎవరు??
on May 12, 2015
.jpg)
ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం ఫిక్సయ్యింది. ఆగస్టు 22 చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. వీటిపై ఆల్రెడీ కసరత్తులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే కథానాయిక ఎంపికపై మాత్రం మల్లగుల్లాలు పడుతుతన్నారు చిరు - పూరి. చిరు ఇమేజ్‌కీ, సైజ్‌కి తగిన కథానాయికని వెదికిపట్టుకోవడం కష్టమే. ఈతరం తమన్నా, సమంత, హన్సిక.. చిరు పక్కన మరీ ఎబ్బెట్టుగా కనపిస్తారు. నయనతార, అనుష్క మాత్రమే చిరుకి సరైన ఆప్షన్లు. అయితే అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతోందని, పెళ్లయ్యాక సినిమాలకు దూరమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నయనతారకు కథ ఓ పట్టాన నచ్చకపోతే అంగీకరించదు. పైగా నయన గొంతెమ్మ కోరికలు ఓ రేంజులో ఉంటాయి. అందుకే దాదాపుగా నయన వద్దు... అనే నిర్ణయానికి చిరు అండ్ కో వచ్చేసినట్టు తెలుస్తుంది. అనుష్క కాదంటే ఏ బాలీవుడ్ భామనో దిగుమతి చేసుకోవాల్సిందే. మరి చిరు ఎటువైపు మొగ్గుతాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



