ఈ అమ్మడికి వరుడు కావలెను
on Mar 19, 2014

"లాహిరి లాహిరి లాహిరిలో" సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అంకిత, ఆ తరువాత వరుస అవకాశాలతో పలు విజయవంతమైన సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ సీన్ రివర్స్ అయ్యి ప్రస్తుతం ఐటెం పాటల్లో, హాట్ హాట్ సన్నివేశాల్లో నటించే అవకాశం కూడా రావట్లేదు ఈ అమ్మడికి. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకొని సినిమాలకు వీడ్కోలు చెప్పాలని అనుకుంటుంది. కానీ వరుడు దొరకట్లేదట.
ఇటీవలే అంకిత తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తిశ్వరాలయానికి విచ్చేసింది. ఇక్కడ ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకుంది. స్వామివారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ...శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు, ప్రస్తుతం వివాహం చేసుకునే పనిలో ఉన్నానని, వివాహం తర్వాత సినిమాలు చేయాలా వద్దా అనేది తర్వాత చెబుతాను అని చెప్పింది.
అంటే ఈ అమ్మడికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ వరుడు దొరకట్లేదు. అందుకే ఏ సమయంలో జరిగే ముచ్చట ఆ సమయంలోనే జరగాలి అని పెద్దలు అంటారు. మరి అంకితకు కాబోయే వరుడు ఎక్కడ ఉన్నాడో...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



