విధ్వంసం సృష్టించిన హీరో, దర్శకుడు
on Nov 23, 2023

భారతీయ సినీ ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్న యానిమల్ మూవీ ట్రైలర్ ఈ రోజు వచ్చేసింది. రావడమే కాదు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి చేత సిల్వర్ స్క్రీన్ మీద రణబీర్, సందీప్ లు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారని అనుకునేలా చేసింది.
కొంతసేపటి క్రితం విడుదలైన యానిమల్ ట్రైలర్ మాములుగా లేదు.ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదనే సంకేతాలని ట్రైలర్ ఇచ్చింది. రణబీర్ తన తండ్రి అనిల్ కపూర్ తో నేను నీ తండ్రిని నువ్వు నా కొడుకు వి అనుకుందాం అంటాడు . ఆ తర్వాత అనిల్ కపూర్ రణబీర్ ని నాన్న అని పిలుస్తాడు.సిగరెట్ తాగుతున్న రణబీర్ పలకడు.దాంతో మళ్ళీ అనిల్ కపూర్ నాన్న నాన్న అని పిలుస్తుంటే రణబీర్ అనిల్ కపూర్ మీద సీరియస్ అవుతాడు.ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్ తోప్రారంభం అయిన ట్రైలర్ చివరిదాకా కూడా అదే ఇంట్రస్ట్ ని ఆడియన్స్ కి కలగ చేసింది. రష్మిక రణబీర్ భార్య హోదాలో రణబీర్ ని తిట్టడం, అనిల్ కపూర్ తన భార్య తో మనం రాక్షసుడికి జన్మనిచ్చాం అని అనడం చూస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఒకప్పటి హీరో బాబీడియోల్ విలన్ రోల్ లో కనిపించాడు.

ట్రైలర్ చివరలో తన తండ్రి అనిల్ కపూర్ తో నీకు ఏమైనా అయితే ఢిల్లీ ని తగలబెడతా నాన్న అని రణబీర్ చెప్పడంతో యానిమల్ సినిమా గురించి ఇప్పటినుంచే జనం మాట్లాడుకొనేలా చేసింది. సాధారణంగా ఒక సినిమా ట్రైలర్ ని చూస్తే ఆ సినిమా కథ పలానా విధంగా ఉండబోతుందనే అంచనాకి ప్రేక్షకుడు వస్తాడు. కానీ యానిమల్ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఈ సినిమా కథ ఏమిటి అని ప్రేక్షకుడు ఉహాకి అందదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ల తర్వాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ తో సంచలనం సృష్టించిన యానిమల్ డిసెంబర్ 1 న ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



