నువ్వు మాత్రం అలాగే ఉండు దొర.. మనసు మార్చుకోకు
on Feb 7, 2026

-సోషల్ మీడియా వేదికగా అభిమానుల హంగామా
-వాళ్ళు ఏం చెప్తున్నారు
-అనిల్ రావిపూడి మరి ఏం చేస్తాడు
పోపులపెట్టెలో ఉండే భారీ ఖర్చులేని మసాలా దినుసులు ఇచ్చే రుచి,సువాసన వల్ల తెలుగు ప్రజలు ఆనందంతో సుష్టిగా, సంతృప్తిగా భోజనం చేస్తారు. సదరు ఈక్వెషన్ తెలుగు సినిమాకి కూడా వర్తిస్తుంది. తన అమ్ముల పొదిలో దాగి ఉన్న ఫ్యామిలీ, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ దినుసుల వల్ల పర్ఫెక్ట్ తెలుగు సినిమా చూశామనే సంతృప్తి ప్రేక్షకులు పొందుతారు. ఒక రకంగా తెలుగు సినిమాకి పునాది కూడా అవే. అనిల్ రావిపూడి ఆ మూడు దినుసులని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్లడమే కాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటు తెలుగు సినిమా గొప్పతనాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా తెలియచేస్తునాడు. రీసెంట్ గా తెలుగు సినిమా ప్రేమికులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి ఒక విన్నపం చేసుకుంటున్నారు. సదరు విన్నపం ఏంటో చూద్దాం.
ఏ డైరెక్టర్ అయినా హిట్ మీద హిట్ ని అందుకుంటు ఉంటే తన రేంజ్ మరింతగా పెరగాలని పాన్ ఇండియా సబ్జెట్స్ వైపు చూడటం సహజం. ఆ విధంగా ఆలోచించడం తప్పు కూడా కాదు. కానీ పాన్ ఇండియా మోజులో పడి రక రకాల అంశాలని కలపాలనే ప్రాసెస్ లో తెలుగు సినిమాతో పాటు, తెలుగు సినిమా లవర్ కి అన్యాయం జరుగుతుంది.దాంతో సంతృప్తి ని పొందలేకపోతున్నాం. ఎప్పుడైనా ఒక సారి పాన్ ఇండియా సబ్జెట్స్ అంటే ఓకె. కానీ ఒక మోస్తరు డైరెక్టర్ నుంచి బడా డైరెకర్స్ దాకా అందరూ అదే దారిని అవలంబిస్తూ నెలకొక సారైనా అలాంటి సినిమాని తీసుకొస్తున్నారు. మీరు మాత్రం ఆ దిశగా ఆలోచించకండి.
అచ్చ తెలుగు సినిమాలతో మమ్మల్ని సంతోష పెడుతూనే ఉండాలి. థియేటర్ ముఖం చూసి సంవత్సరాలు,సంవత్సరాలు అవుతున్న పెద్ద వాళ్ళు సైతం మీరు అందిస్తున్న తెలుగు సినిమా దినుసుల వల్లే థియేటర్స్ కి వస్తున్నారు. పైగా మీకు సంక్రాంతి నెల పై పేటెంట్ హక్కు పొందిన వ్యక్తిగా కూడా రికార్డు ఉంది. కాకపోతే ప్రతి సంక్రాంతికి కాకుండా మీరు అందించే నవ్వుల విందు ఆరునెలలకి ఒకసారైనా వచ్చే అవకాశం ఉంటే చూడండి అంటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఓన్లీ సింగిల్ ఫ్రమ్ ముంబై!.. మాఫియా నేపధ్యం పక్కానా!
అనిల్ రావిపూడి అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే రకరకాల హీరోల పేర్లు వినిపిస్తున్నా ఇంకా కన్ఫార్మ్ కాలేదు.ఇటీవల ఆయన మాట్లాడుతూ ఈ సారి టైటిల్ నుంచే ఎంటర్ టైన్ మెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



