'పక్కా కమర్షియల్'.. 'అందాల రాశీ' వచ్చేస్తోంది
on May 26, 2022

'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంది.
ఈ సినిమాలోని 'అందాల రాశీ' పాట జూన్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ సాంగ్ లాగే 'అందాల రాశీ' సాంగ్ కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా కరమ్ చావ్ల, ఎడిటర్ గా ఉద్ధవ్ వర్క్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



