'డిటెక్టివ్ రుద్ర'తో రైటర్ గా మారిన యాంకర్ రవి...స్పాటిఫైలో రిలీజ్ ఐన పాడ్ కాస్ట్స్
on Nov 5, 2022

యాంకర్ రవి ఈ పేరు తెలియని తెలుగు ఆడియన్స్ లేరు. టెలివిజన్ రంగంలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా చేస్తూ మరో పక్క.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈవెంట్లకు కూడా హోస్ట్ గా చేస్తూ అప్పుడప్పుడు మూవీస్ లో కూడా కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు రవి… బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా అందరినీ అలరించాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కూడా ఉంటాడు. "ఆడాళ్ళు మీకు జోహార్లు" షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు రవి. నటన మాత్రమే తనలో ఒక రైటర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు యాంకర్ రవి. దానికి ఉదాహరణ ఇదే.. "డిటెక్టివ్ రుద్ర" పేరుతో ఒక సీరియల్ రాసాడు రవి. ఇప్పుడు ఈ సీరియల్ పోడ్ కాస్ట్ స్పాటిఫైలో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ థీమ్ వచ్చి " స్మశానంలో మాయమవుతున్న శవాల నుంచి ఫిలిం సెట్ లో జరిగే మర్డర్స్ వరకు వీటి వెనక ఉన్న క్రైమ్ ని బయటపెడతారు డిటెక్టీవ్ రుద్రా అతని ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ వెంకట్. ఆధారాలు దొరకని ఎన్నో క్రైమ్స్ ని రుద్రా తన తెలివితేటలతో చేధిస్తాడు..ఎవరి ఊహకు అందని రీతిలో ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాడు." ఇది ఓవరాల్ గా ఈ సీరియల్ సినాప్సిస్..ఇక ఈ సీరియల్ పోడ్ కాస్ట్ న్యూ ఎపిసోడ్స్ ని ప్రతీ బుధవారం, శుక్రవారాల్లో అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు 4 ఎపిసోడ్స్ ని స్పాటిఫై లో అప్ లోడ్ చేశారు. "అంతులేని కథ పార్ట్ - 1 , 2 , అన్వేషణ పార్ట్ - 1 , 2 " రిలీజ్ అయ్యాయి. డిటెక్టివ్ కథలంటే చెవి కోసుకుని వారు రైటర్ గా అడుగుపెట్టిన యాంకర్ రవి కలం నుంచి జాలువారిన ఈ సీరియల్ విని మార్క్స్ వేసేయండి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



