అనసూయకు మెగా ఆఫర్!!
on Apr 23, 2019

బుల్లి తెర సంచలనం ఎవరంటే...టక్కున చెప్పే పేరు అనసూయ. అమ్మాయిలకు కూడా అసూయ పుట్టే గ్లామరంటే అనసూయదే. బుల్లి తెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది అనసూయ. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో తొలిసారి నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత `క్షణం` చిత్రంలో ఇంపార్టెంట్ క్యారక్టర్ చేసింది. ఆ సినిమా తర్వాత మెగా మేనల్లుడు `విన్నర్` చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ సినిమా హిట్ కాకపోయినా... ఆమె పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఇక ఇటీవల రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎఫ్ 2 లో కామెడీ పాత్రలో నటించి తనలో ఉన్న మరో కోణాన్ని చూపించింది.
ఇదిలా ఉంటే ఆమెకు లేటెస్ట్ గా మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మే ఎండింగ్ లో కానీ, జూన్ మొదటి వారంలో కానీ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ కోసం అనసూయ ను సంప్రదించగా .. వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. మెగాస్టార్ తో నటించే అవకాశం రావడంతో అనసూయ్య తబ్బుబ్బిపోతోందట. త్వరలో దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



