Anandhalahari web series Review: ఆనందలహరి వెబ్ సిరీస్ రివ్యూ!
on Oct 18, 2025

వెబ్ సిరీస్ : ఆనందలహరి
నటీనటులు: అభిషేక్, భ్రమరాంబిక తదితరులు
ఎడిటింగ్: హరీష్ కుమార్ అడపాక
మ్యూజిక్: జాయ్ సోలమన్
సినిమాటోగ్రఫీ: అశోక డబ్బేరు
నిర్మాతలు : ప్రవీణ్ ధర్మపురి
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాయి వనపల్లి
ఓటీటీ : ఆహా
కథ:
ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆనంద్ (అభిషేక్) అనే అబ్బాయి ఉంటాడు. అతను వాళ్ల ఊరి సర్పంచ్ కొడుకు. బిటెక్ ఫెయిల్ అయినా పాసయ్యానని చెప్పి ఇష్టమొచ్చినట్టు తాగి తిరుగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆనంద్ వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తాడు. అప్పుడే లహరి(భ్రమరాంబ) వెస్ట్ గోదావరి అమ్మాయి పెళ్ళి సంబంధం వస్తుంది. ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ తో తను పెరుగుతుంది. ఎక్కడికైనా సిటికి వెళ్లి బతకాలి, జాబ్ చేయాలనుకుంటుంది. పెళ్లంటే ఇష్టం ఉండదు. కానీ ఓ సంఘటనతో లహరి తల్లి ఆమెకి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. దీంతో ఈ రెండు కుటుంబాలు కలిసి ఆనంద్ లహరికి పెళ్లి చేస్తాయి. లహరి పెళ్లి చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వవు.
పెళ్లితర్వాత ఇద్దర్ని హైదరాబాద్ లో కాపురం పెట్టమని పంపిస్తారు. ఫ్రీడమ్ వస్తుందని లహరి ఓకే అంటుంది కానీ ఆనంద్ వద్దని అంటాడు. చివరికి అందరు కలిసి వాళ్ళని హైదరాబాద్ పంపిస్తారు. లహరి జాబ్ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆనంద్ తాగి ఏమి పట్టించుకోకుండా తిరుగుతుంటాడు. డబ్బుల కోసం ఇంట్లోవి అన్ని అమ్మేయడం మొదలుపెడతాడు. ఆనంద్ తండ్రి అతనికి డబ్బు ఇవ్వకుండా లహరికి ఇస్తాడు. దీంతో డబ్బుల కోసం లహరి చెప్పిన ఇంట్లో పనులన్నీ చేస్తాడు ఆనంద్. ఇద్దరి మధ్య గొడవలు అవుతుంటాయి. ఈ ఇద్దరూ విడిపోదామకునే వరకు వెళ్తారు. మరి ఈ ఇద్దరూ కలిసే ఉంటారా? లహరి జాబ్ తెచ్చుకుంటుందా లేదా తెలియాలంటే ఆహాలోని ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
పల్లెటూరిలో ఏదైనా మూవీ గానీ వెబ్ సిరీస్ గానీ వస్తుందంటే దానిపై కాస్త సినిమా లవర్స్ కి కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి మనుషులు, వాతావరణం అన్నీ కూడా ఇట్టే నచ్చేస్తాయి. అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సిరీస్ 'ఆనందలహరి'. ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లతో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ ముప్పై నుండి నలభై అయిదు నిమిషాలు వరకు నిడివి ఉంది.
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మధ్య ఉండే వ్యత్యాసం చూపెడుతూ అక్కడి యాసతో పాటు పెళ్ళి తంతు అన్నీ కూడా వివరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అది చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అయితే ఇందులో కామెడీ తగ్గింది. ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా అడల్ట్ సీన్లు లేకుండా జాగ్రత్త పడినా.. కామెడీ లేకుంటే బోర్ కొట్టేస్తుంది. ఈ సిరీస్ లో అదే లోపించింది. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్ బాగున్నాయి.
సిరీస్ లో కొన్ని లాజిక్ లు మిస్ అయ్యాడు దర్శకుడు. బిటెక్ చదువుకున్న హీరోకి వీసా అంటే తెలియకపోవడం, ల్యాప్‌టాప్ ఎలా ఆన్ చేయాలో తెలియకపోవడం లాంటివి కొన్ని లాజిక్ లు మిస్ అయ్యారు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వస్తే పెద్దలేం చేయాలని ఓ మంచి మెసెజ్ కూడా ఉంది. క్లైమాక్స్ లో హీరో చెప్పే కొన్ని మాటలు అందరికి కనెక్ట్ అవుతాయి. అయితే ఇదే కథతో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు, సినిమాలు వచ్చాయి అందుకే ఇది రొటీన్ గా అనిపిస్తుంది. సిరీస్ లో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇందులో నాలుగు పాటలు ఉంటాయి. ఇంకా చాలావరకు ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఆ పాటలు తీసేసి, ల్యాగ్ సీన్లని తీసేసి ఇంకాస్త ట్రిమ్ చేసి అయిదు నుండిఆరు ఎపిసోడ్ ల వరకు చేసి రిలీజ్ చేస్తే బాగుండనిపించింది. అయితే సిరీస్ లో కొత్తగా ఏం లేకపోయినా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళ మధ్య సంభాషణల కోసం, హీరో, హీరోయిన్ ల మధ్య గొడవల కోసం ఓసారి ట్రై చేయొచ్చు. అడల్ట్ సీన్లు లేవు.. అసభ్య పదజాలం వాడలేదు. ఎడిటింగ్ లో కొన్ని సీన్లు తీసేస్తే బాగుండు. మ్యూజిక్ ఒకే కానీ ఆ నాలుగు పాటలు లేకుంటే కాస్త నిడివి తగ్గేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.5 / 5
ఫైనల్ గా : ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఆనందలహరి.. వన్ టైమ్ వాచెబుల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



