అనామిక సెన్సార్ పూర్తి
on Mar 13, 2014

హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన "కహానీ" చిత్రాన్ని తెలుగులో "అనామిక" పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తి చేసుకుంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైభవ్, హర్షవర్ధన్, రాణే కీలక పాత్రలు పోషించారు.వయాకామ్ 18, ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్, లాగ్ లైన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



