అఖిల్ మూవీ లేటెస్ట్ అప్ డేట్!!
on Jun 18, 2019

అక్కినేని హీరో అఖిల్ ` బొమ్మరిల్లు` భాస్కర్ కలయికలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ నెల 26 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. స్టోరి ప్రకారం 75 పర్సెంట్ హైదరాబాద్ లో మిగతా భాగం అబ్రాడ్ లో షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత డైరక్షన్ చేస్తోన్న చిత్రమిది. అఖిల్ మిస్టర్ మజ్ఞు తర్వాత చేస్తోన్న తన నాల్గవ చిత్రమిది. ఇద్దరికి సరైన హిట్ లేకపోవడంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంట్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో అఖిల్ మదర్ గా ఆమని నటిస్తోన్నట్లు సమాచారం. అల్లు అరవింద్ సమర్ఫణలో జిఎ2 పతాకంపై బన్నీవాస్, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



