జెర్సీ రీమేక్‌లో అమలా పాల్!
on Aug 13, 2019

తెలుగు లో నానినటించగా విమర్శకుల, ప్రముఖుల ప్రశంసలు అందుకున్న చిత్రం `జెర్సీ`. అయితే ఈ చిత్రం హిందీ తో పాటు తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక తమిళ్ లో నాని పాత్రలో విష్ణు విశాల్ నటిస్తున్నట్లు సమాచారం. శ్రద్ధ శ్రీనాథ్ పాత్రలో అమలా పాల్ ని తీసుకోనున్నారని కోలీవుడ్ సమాచారం. గతం లో విష్ణు విశాల్ , అమలా పాల్ కలిసి `రాచ్చసన్ ` లో నటించారు. వీరిద్దరిది హిట్ పెయిర్ అన్న టాక్ ఉండటంతో మరో సారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే గ్యారంటీ సక్సెస్ అంటున్నారు కోలీవుడ్ ఆడియన్స్. అమలా పాల్ కూడా `జెర్సీ` లో చేయడానికి ఆసక్తి కనబరుస్తుందట. ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయడానికి రానా ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు న్యూస్ వస్తున్నప్పటికీ దీని పై రానా ఇంతవరకు స్పందించ లేదు. ఇక `జెర్సీ `చిత్రాన్ని బాలీవుడ్ లో కరణ్ జోహార్ రీమేక్ చేస్తున్నారు. అమలాపాల్ తెలుగు , తమిల్ భాషల్లో ఇటీవల ఒక సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



