ఘనంగా అమలాపాల్ పెళ్లి
on Jun 12, 2014
అందాలభామ అమలాపాల్ పెళ్లి జరిగిపోయింది. తమిళ దర్శకుడు విజయ్ తో ఆమె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. జూన్ 6 వీరి నిశ్చితార్థం క్రైస్తవ పద్దతిలో కేరళాలో జరిగింది. వివాహం హిందూ సంప్రదాయ పద్దతిలో చెన్నైలో సినీ ప్రముఖుల మధ్య జూన్ 12 న ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికూతురుగా అమలా పాల్ మెరిసిపోయింది. కనకాంబరం రంగు పట్టు చీరలో బుట్టబొమ్మలా కనిపించింది. విజయ్, అమలాపాల్ జంటని ఆశీర్వదించడానికి దక్షిణాది సినీప్రముఖులు అనేకులు హాజరయ్యారు.
మరిన్ని ఫోటోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. Amala Paul Marriage Photos